New Ration Cards: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై డబల్ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన

New Ration Cards
New Ration Cards

New Ration Cards: ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ను తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనాలు చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిగో ఇస్తున్నాం.. అదిగో ఇస్తున్నాము చెప్పడమే తప్ప ఇప్పటివరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు. ఈ క్రమంలో ప్రజలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఎప్పుడు వస్తాయో అంటూ ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి శుభవార్తను తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ప్రజలకు ఎప్పుడు అందించబోతున్నారు తెలిపింది.

ఈ వార్త విని కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి కొంత ఊరట లభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీనే ఈనెలాఖరి నుంచి చేపడుతారని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రోజు కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను అర్హులైన వాళ్లకి అందజేశారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు.

వచ్చే పది రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త ఇంటి కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఇది మంచి శుభవార్త అని తెలుస్తుంది. అలాగే వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో నీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రోడ్లను మరమ్మతు చేయాలని కూడా అధికారులను సూచించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కూడా అధికారులకు ఆదేశించారు. ఇలా వివిధ రకాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉగాది పండుగ నుంచి కొత్త రేషన్ కార్డులు ప్రజలకు పంపిణీ చేయనున్నారు. కొత్త తెలుగు ఏడాది సందర్భంగా ప్రజలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుందని తెలుస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now