New Rules: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు భారీగా ఉపశమనం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం టాక్స్ ఫైలింగ్, మనీ ట్రాన్సాక్షన్లో, బిజినెస్ ఆపరేషన్లను సులభతరం చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కొత్త రూల్స్ రానున్నాయి. దీనివలన చాలామందికి ఊరట లభిస్తుంది. కొత్త రూల్స్ ఎప్పటినుంచి అమలులోకి రానున్నాయో వాటి వలన ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఇండియా టాక్స్ సిస్టం ని మరింత సమర్థవంతంగా మరియు టాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు తరచూ కీలక మార్పులు చేస్తూనే ఉంటుంది.
2025లో ప్రకటించిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఉపశమనం కలిగేలా అనేక చర్యలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం టాక్స్ ఫైలింగ్, మనీ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ఆపరేషన్లను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంది. అనవసరమైన టాక్స్ డిటెక్షన్లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం టీడీఎస్ మరియు టిసిఎస్ లను సులభతనం చేసేందుకు పన్ను నియమాల్లో కీలక మార్పులు చేపట్టింది. అయితే ఈ మార్పులు ఏప్రిల్ ఒకటి 2025 నుంచి అమలులోకి వస్తాయని తెలుస్తుంది.
ఇప్పుడు ఎటువంటి అనవసరమైన కాంప్లెక్సిటీలు లేకుండా సాధారణ పనులు చెల్లింపు దారులు మరియు వ్యాపారులు సులువుగా ఐటిఆర్ ఫైల్ చేసుకోవచ్చు. తమ కార్యకలాపాలను నిర్వర్తించవచ్చు. వ్యాపారులు పెద్ద అమ్మకాలపై టిసిఎస్ రద్దు అలాగే 50 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలు ఉన్న వ్యాపారులకు ముందుగా 0.1% టి సి ఎస్ ను డిటెక్ట్ చేయాలి. ఏప్రిల్ ఒకటి 2025 నుంచి ఈ నియమమును పూర్తిగా తొలగించడం జరుగుతుంది. పన్ను సంబంధిత అవాంతరాలు తగ్గి వ్యాపార కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలుస్తుంది. అలాగే బ్యాంకు నుంచి వడ్డీ పొందినప్పుడు లేదా అద్దె చెల్లించినప్పుడు, పెద్దమ్మతంలో చెల్లింపులు కూడా చేసినప్పుడు టీడీఎస్ డిడక్ట్ అవుతుంది.