JaggaReddy: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: తనకు ఏ ఎమ్మెల్సీ వద్దని, ఊహాగానాలకు చెందిన వార్తలు తనపై రాయొద్దని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం రైలులో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. రైల్లో ఢిల్లీకి ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక వీడియోను తన “ఎక్స్” (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
పత్రికా సోదరులు ఊహాగానాల వార్తలు తనపై రాయొద్దని, తనకు ఎమ్మెల్సీ కావాలని అడగడం లేదని, అడుగను అని కూడా స్పష్టం చేశారు. ఆల్రెడీ తాను పోటీ చేసి, పరిస్థితులు అనుకూలించగా ఓటమిపాలయ్యానని అన్నారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఎమ్మెల్సీ పదవి అడిగి తీసుకోవాల్సిన క్యారెక్టర్ తనది కాదని అన్నారు.
ఎమ్మెల్సీ విషయంలో ఊహాగానాల వార్తలు ఇకముందు తనపై రాయొద్దని ట్విట్టర్ వేదికగా కోరారు. ఢిల్లీకి వెళ్ళాక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికితే ఆయనతో మాట్లాడతానని మాత్రం స్పష్టం చేశారు.