Astro Tips: సనాతన ధర్మంలో దాతృత్వానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని వస్తువులేనా దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది అని చాలామంది నమ్మకం. అయితే జీవితంలో సంతోషంగా ఉండాలంటే వీటిని దానం చేయాలి అని నిపుణులు చెప్తున్నారు. సనాతన ధర్మం ప్రకారం ఒక పండుగ లేదా ప్రత్యేక రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వలన చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కొంతమంది ప్రజలు దానం చేయడానికి కూడా సరైన సమయం మరియు అవకాశం కోసం వేచి ఉంటారు. దాతృత్వం కోసం ప్రత్యేకంగా కొన్ని నియమాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో సూచించారు. వీటిని అనుసరించి దానం చేయడం వలన ఫలితాన్ని అనేక రెట్లు పెంచుకోవచ్చు. కొన్ని కష్టాలను తొలగించడానికి అలాగే కొన్ని కోరికలను నెరవేర్చుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేక రోజులలో దానం చేయాలి.
దానం చేయడం వలన గ్రహాలకు సంబంధించిన దోషం తొలగిపోవడం మాత్రమే కాకుండా పాపం నుండి కూడా విముక్తి పొందవచ్చు. ధర్మం చేయడం వలన ఇహంలో సుఖసంతోషాలు అలాగే పరలోకంలో మోక్షం లభిస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. ఎవరి సామర్థ్యానికి తగ్గట్లు వాళ్ళు దానం చేయడం ఉత్తమం. అలాగే వేసవికాలంలో కూడా కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వలన చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని నిపుణులు సూచిస్తున్నారు. వేసవికాలంలో ముఖ్యంగా దాహం వేసిన వారికి నీళ్లను ఇవ్వడం వలన చాలా గొప్ప పుణ్యం కలుగుతుంది. వేసవికాలంలో ఎక్కువగా ప్రజలందరూ కూడా దాహంతోనే ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి నీరు ఇవ్వడం వలన చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి చాలామంది కూడా వేసవికాలంలో నీటి చలువ కేంద్రాలను ఏర్పాటు చేసి దారిన పోయే ప్రజలందరికీ దాహం తీరుస్తూ ఉంటారు.
శాస్త్రాలలో మామిడిపండును దానం చేయడం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. మామిడి పండుకు అలాగే సూర్య భగవాన్ కి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉందని చెప్తారు. కాబట్టి మామిడిపండును దానం చేస్తే సాక్షాత్తు ఆ సూర్య భగవాన్ ను ప్రసన్నం చేసుకున్నట్టే అంటూ నిపుణులు చెప్తున్నారు. ఎవరి జాతకంలో అయినా సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే వాళ్లు మామిడిపండును దానం చేయడం వలన వాళ్ళ జీవితంలో చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. పురాణ గ్రంథాల ప్రకారం పూజ చేస్తున్న సమయంలో బెల్లం వాడడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. బెల్లం దానం చేయడం వలన కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. బెల్లం దానం చేయడం వలన ఆ వ్యక్తి జాతకంలో సూర్యుడు స్థానం చాలా బలపడుతుందని నిపుణులు చెప్తున్నారు.