WhatsApp: ఇప్పటివరకు చాలామందికి తెలియని.. వాట్సాప్ లో ఉన్న సీక్రెట్ ఫీచర్స్ ఇవే.. తెలుసుకోండి

WhatsApp
WhatsApp

WhatsApp: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ చాలా ముఖ్యమైన అవసరం గా మారిపోయింది. మన నిత్య అవసరాలకు సంబంధించిన చాలా రకాల పనులు వాట్సాప్ ద్వారా జరుగుతున్నాయి. కానీ ఇందులో ఉండే డేటా విషయంలో కొంతమందిలో భయం ఉంటుంది. మీరు పంపించే సమాచారం సురక్షితంగా ఉంటుందా లేదా అని అనుమానం చాలామందిలో ఉంటుంది. వాట్సాప్ లో ఉన్న కొత్త ఫీచర్ ని మీరు ఆన్ చేసిన తర్వాత కొంత సమయం తర్వాత మీరు చాట్ చేసిన కొన్ని సందేశాలు ఆటోమేటిక్గా అవి అదృశ్యం అవుతాయి. పైరసీకి ఈ ఫీచర్ చాలా మంచిది. ఈ కొత్త ఫీచర్ మీ డేటాను ఎవరు దొంగలించకుండా చూస్తుంది. స్పై కూడా చేయలేరు.

వాట్సాప్ లో బహుళ గ్రూపులను ఒకే చోట జోడించడానికి కూడా కమ్యూనిటీ ఫీచర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ తో పాఠశాల, కార్యాలయాలు లేదా సొసైటీ సమూహాల వంటి అనేక గ్రూపులను ఒకే చోట సులభంగా జోడించవచ్చు. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపే ముందు మీరు వినే అవకాశం ఉంది. గతంలో మీరు పంపే వాయిస్ మెసేజ్ మీరు వినడానికి వీలు ఉండేది కాదు. అటువంటి సమయంలో పొరపాటున ఒకరికి పంపాల్సిన వాయిస్ మెసేజ్ మరొకరికి వెళ్లిపోయిన మీకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.

మీరు పంపించిన మెసేజ్ మీరు 15 నిమిషాలలో సవరించుకోవచ్చు. వాట్సాప్ లో కూడా ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యాడ్ యువర్ స్టిక్కర్ను మీరు మీ స్టేటస్ పై పెట్టుకోవడం వలన మీ మిత్రులను కూడా ప్రత్యుత్తరం ఇవ్వడానికి మీరు ఆహ్వానించవచ్చు. స్టిక్కర్ ప్రియులు దీనిని ఇష్టపడతారు. అలాగే మీరు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తున్న సమయంలో మీ స్క్రీన్ కూడా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా మీటింగ్లకు లేదా ఒకరి కంటే ఎక్కువ మందికి ఏదైనా విషయం వివరించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ లో మీరు చేసిన వ్యక్తిగత చాట్ మీరు వేలిముద్రలతో లేదా పాస్వర్డ్ ద్వారా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now