Weekly Horoscope: జూన్ 29 నుంచి జూలై 5, 2025 మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వార ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: ఈ వారం రోజులు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలను కూడా వింటారు. కుటుంబ సభ్యుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆకస్మికంగా ప్రయాణం అలాగే సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకున్న ఆఫర్లు వస్తాయి. ఉద్యోగం మారడానికి కూడా సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు శ్రమించాలి. ఆరోగ్యం బాగుంటుంది. పెళ్లి సంబంధం బంధువులలో కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి: ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి. బంధువులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల కారణంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా శ్రమించి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు బాగా శ్రమించాలి.
మిధున రాశి: ఈ వారం రోజులు చాలా అనుకూలంగా సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో ఊహించిన లాభాలు పొందుతారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. విద్యార్థులు కొద్దిగా శ్రమించడం వలన విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి: ఈ వారం అంతా శుభవార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఉద్యోగంలో అధికారులనుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో ఆక్టివిటీ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. విద్యార్థుల మీద ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి: ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో అందరి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో ఇతరుల మీద ఆధార పడకూడదు. ఆస్తి మరియు ఆర్థిక విషయాలలో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది అనుకూల సమయం.
కన్య రాశి: ఆదాయం బాగుంటుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. మిత్రుల వలన ఆర్థికంగా నష్టపోతారు. ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. హోదా పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలను విస్తరించుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు.
తులారాశి: ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ సలహాలు అధికారులకు ఉపయోగపడతాయి. పదోన్నతితోపాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో వాగ్దానాలు చేయకపోవడం మంచిది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాలలో ఉన్న పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఇది అనుకూల సమయం.
వృశ్చిక రాశి: ఈవారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో బిజీగా ఉంటారు. ఆదాయం ప్రయత్నాలలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇంట బయట విలువ ఉంటుంది. మంచి పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక మరియు ఆస్తి వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాలి.
ధనస్సు రాశి: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ప్రయత్నించి ఆదాయం పెరిగేలా చేసుకుంటారు. ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. వ్యాపారంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా పురోగతి సాధిస్తారు.
మకర రాశి: ఈవారం సంతృప్తికరంగా సాగుతుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. వ్యాపారంలో ఊహించిన లాభాలు వస్తాయి. షేర్లు మరియు స్పెక్యులేషన్ల వలన ఆదాయం పెరుగుతుంది. బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో సమయం అనుకూలంగా ఉంది.
కుంభరాశి: అనారోగ్య సమస్యలు, అనవసర ఖర్చులు ఏర్పడతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ కుటుంబ సభ్యుల ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండవు. అనుకున్న పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఇబ్బంది పడతారు. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా శ్రమించాలి.
మీనరాశి: ఈవారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. చేతికి రావలసిన డబ్బులు అందకపోవచ్చు. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొత్త పరిచయాల కారణంగా లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.