Chit Fund: తెలుగు రాష్ట్రాలలో చిట్టి పథకం చాలా ఫేమస్. అయితే ఈ పథకంలో కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. వాటిని కనుక మీరు సరిగ్గా తెలుసుకోకపోతే మీ డబ్బులు కూడా పోయే అవకాశం ఉంది. చిట్టి వ్యాపారం గురించి చాలామందికి తెలుసు. అయితే ఇది చాలా సులభమైన మరియు రిస్క్ తో కూడుకున్న ఫైనాన్షియల్ స్కీమ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చిట్టి పథకం ఒక పాపులర్ పెట్టుబడి రూపం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఆర్థరైజెడ్ చిట్టి పథకం మరియు అనాథరైజ్డ్. ఆర్థరైజ్డ్ సంస్థలు రిజిస్టర్ ఆఫ్ చిట్స్ ద్వారా అనుమతి పొందినవి. కానీ అనాధరై ఇచ్చిన సంస్థలకు ఎటువంటి అనుమతి ఉండదు. ఇవి రిస్క్ తో కూడినవి. మీరు ఎప్పుడైనా ఆథరైజ్డ్ చిట్టి సంస్థలను ఎంచుకోవడం ఉత్తమం.
అనుమతి పొందిన సంస్థలను మాత్రమే ఎంచుకోవాలి. ఈ సంస్థలు ప్రభుత్వ గుర్తింపు కలిగినవి. మీరు చిట్టి కట్టే ముందు బిడ్ విధానం, ప్రాసెసింగ్ ఫీజులు మరియు చెల్లించే అమౌంట్ అన్ని పూర్తిగా చదువుకోవాలి. ఆ సంస్థ యొక్క ట్రాక్ రికార్డును ముందుగా పరిశీలించడం ఉత్తమం. గత చిట్టి చెల్లింపులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాత కస్టమర్ల నుంచి సమాచారం కూడా ముందుగా సేకరించడం అవసరం.లీగల్ డాక్యుమెంట్లు అన్నీ కూడా బాగా పరిశీలించాలి. ముందుగా అగ్రిమెంట్ పత్రాలు, రిజిస్ట్రేషన్ మరియు లీగల్ సలహాలు తీసుకోవడం చాలా మంచి ఆలోచన. అలాగే చిట్టి ప్రాసెస్ లో డబ్బును ఎప్పుడు తీసుకోవడం మంచిది.
అత్యవసర సమయంలో లేదా వ్యాపారం ప్రారంభించడానికి త్వరగా డబ్బు తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందో లేదో తెలుసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్లో చివరి నెలలో మీరు డబ్బు తీసుకుంటే మొత్తం డబ్బు ఎక్కువగా పొందవచ్చు. పొదుపు అలవాటు ఉన్నవాళ్లు ఈ ప్రాసెస్ ని ఎంచుకోవచ్చు. చిట్టి పథకం ప్రారంభించిన ముందు డబ్బు తీసుకున్నప్పుడు మొత్తం కంటే తక్కువ డబ్బు లభించే అవకాశం ఉంటుంది. ఇటువంటి వారికి అత్యవసర సమయంలో డబ్బు అందుబాటులో ఉండదు. మరియు మోసాలకు గురై ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. నకిలీ చిట్టి సంస్థలకు దూరంగా ఉంటే మంచిది. ఆ పత్రాలలో నిబంధనలను పూర్తిగా చదవకుండా కూడా సంతకం చేయకూడదు.