Todays Gold Rate: ఒక రోజులోనే భారీగా తగ్గిన పసిడి ధర.. త్వరలో 56 వేలకు పసిడి..
యూఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్న సమయంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఎల్లో మెటల్ ఒక్క రోజులోనే భారీగా పతనం అయ్యింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ దెబ్బతో అతలాకుతలం అవుతున్నాయి. దేశంలో ప్రధాన నగరాలలో పసిడి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లో, ఎల్లో మెటల్స్ మరియు క్రూడ్ ఆయిల్ అన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లతో పాటు భారతదేశంలో మార్కెట్లో కూడా భారీ స్థాయిలో పతనం కనిపిస్తుంది. ఈ క్రమంలో కేవలం ఒక్క రోజులోనే పసిడి ధర రూ. 1750 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పచ్చడి ధర రూ. 1610 తగ్గింది. బిజినెస్ అనలిస్టుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో పసిడి ధర 40 శాతం వరకు తగ్గి రూ. 56 వేలకు దిగి వస్తుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 5, 2025 శనివారం దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
పసిడి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 91,630 గా ఉంది. అలాగే చెన్నై, ముంబై, బెంగళూరు, కేరళ వంటి ప్రధాన నగరాలలో కూడా ఈ ధరలే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 84,140 గా ఉంటే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 91,780 గా ఉంది.
వెండి ధరలు ఇలా ఉన్నాయి…
పసిడి బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. గత మూడు రోజుల్లో వెండి ధరలు దాదాపు రూ.6100 తగ్గింది. లక్ష దాటిన వెండి ధరలు ప్రస్తుతం రూ.98,900 కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,07,900 గా ఉంది. అలాగే కేరళ, చెన్నైలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కత్తా లో కిలో వెండి ధర రు.98,900 ఉంది.