Todays Gold Rate: లక్షకు దగ్గరవుతున్న పసిడి ధరలు.. ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: బంగారం ధరలు రానురాను మళ్ళీ భానుడి ప్రతాపంలా మండిపోయేలా ఉన్నాయి. గత నెలలో తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్ళీ లక్షకు దగ్గరవుతున్నాయి. గత నెలలో ఒకానొక సందర్భంలో లక్ష రూపాయలు దాటిన తులం బంగారం ధర క్రమక్రమంగా తగ్గుతూ మధ్యతరగతి కుటుంబాలకు, పసిడి ప్రియులకు హమ్మయ్య మళ్ళీ బంగారం ధరలు తగ్గుతున్నాయి అని సంతోషపడేలోపే బంగారం.. బంగారమే అన్నట్లుగా ధరలు మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యాలలో బంగారం ప్రాముఖ్యత మొదటి స్థానంలో ఉంటుంది. అది పెళ్లిళ్లు పేరంటాలు, ఇలా ఏ శుభకార్యాలలో అయిన బంగారానికి ఉండే ప్రాముఖ్యత వేరు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంటున్నాయి. బంగారం ధరలు తగ్గు తున్నాయంటే జ్యువెలరీ షాపుల్లో మహిళల సందడి అంతా.. ఇంతా.. ఉండదు. లక్షకు దగ్గరగా బంగారం ధరలు రావడంతో మధ్యతరగతి వారు బంగారం కొనాలంటేనే జంకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.

Also Read:బంగారం ధరల దోబూచులాట.. ఈరోజు బంగారం ధరలు

ప్రధాన నగరాలలో శనివారం బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ నగరంలో 10 గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ.99010/- ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 90760/- కాగా, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ. 74260/- గా ఉంది.

అహ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.99060/-, 10 గ్రాముల 22 క్యారెట్లు ధర రూ. 90810/- కాగా, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ. 74300/- గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్లు ధర రూ. 99010/-, 10 గ్రాముల 22 క్యారెట్లు ధర రూ. 90760/- కాగా, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74810/- గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 99160/-ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 90910/- కాగా 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ. 74390/- ధర ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 99010/- ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90760/- కాగా, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74260/- గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.99010/- ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్లు ధర రూ.90760/- కాగా, 10 గ్రాముల 18 క్యారెట్లు ధర రూ.74260/- గా ఉంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 99010/- ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.90760/- కాగా, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.74260/- గా ధరలు నమోదయ్యాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now