Todays Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు స్పీడుగా పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకొని లక్ష మార్కును దాటిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం గోల్డ్ ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది. నేడు బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి ధర 98000 గా ఉన్నట్లు సమాచారం. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు ఏప్రిల్ 26, 2025 శనివారం ఉదయం పలు మీడియాలలో నమోదైన బంగారం రేటు ప్రకారం మన దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.90,040, 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.98,230 ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కిలో వెండి ధర రూ.1,00,800. దేశవ్యాప్తంగా పసిడి తులం పై పది రూపాయలు అలాగే కిలో వెండి పై వంద రూపాయల మేర తగ్గినట్లు తెలుస్తుంది. దేశంలోని ప్రాంతాలవారీగా పసిడి మరియు వెండి ధరలలో వ్యత్యాసం ఉంటుంది.
మనదేశంలోని పలు ప్రధాన నగరాలలో ఈరోజు పసిడి, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి…
ఈరోజు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.90,040, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.98,230.
విశాఖపట్నం, విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.90,040, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.98,230.
నేడు ఢిల్లీ పట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.90,190, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.98,330.
ముంబయి పట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,040, కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.98,230.
చెన్నై పట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.90,040, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.98,230.
బెంగళూరు పట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.90,040, కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.98,230.
అలాగే ఈరోజు వెండి ధరలు పలు ప్రధాన నగరాలలో ఇలా ఉన్నాయి…
ఈరోజు హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,10,800.
విజయవాడ, విశాఖపట్నంలో నేడు కిలో వెండి ధర రూ.1,10,800.
ఢిల్లీలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,00,800.
ముంబైలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,00,800.
బెంగళూరులో ఈరోజు కిలో వెండి ధర రూ.1,00,800.
చెన్నైలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,800.
అయితే ఈ ధరలన్నీ ఈరోజు ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా గుర్తించగలరు.