Todays Horoscope: ఈ రాశి వారిని వెతుక్కుంటూ అదృష్టం.. అదృష్ట రాశి ఫలాలు..

horoscope results
horoscope results

Todays Horoscope: ఈ రాశి వారిని వెతుక్కుంటూ అదృష్టం.. అదృష్ట రాశి ఫలాలు..

నేడు మార్చి 28, 2025 నాటి 12 రాశుల రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మిథున రాశి వాళ్లకి ఆదాయం రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. నేడు మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషరాశి:

ఉద్యోగంలో పైకి ఎదుగుతారు. వృత్తి మరియు వ్యాపారాలలో లాభాలు కొనసాగుతాయి. ఆదాయం పెరగడంతో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజకీయంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా సాగుతాయి.

వృషభ రాశి:

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ వహించాలి. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగుతాయి.

మిథున రాశి:

ఏ పని చేసినా కూడా ఫలితం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. అది నాకు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన లాభాలను ఇస్తాయి.

కర్కాటక రాశి:

ఉద్యోగ జీవితంలో కొత్త పుంతలు తొక్కుతారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారాలలో బిజీగా ఉంటారు. స్వల్పన ఆరోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. శుభవార్తలు విని అవకాశముంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంకా మరియు బయట మాటకు విలువ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగుతాయి.

సింహరాశి:

వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు మామూలుగా సాగిపోతాయి. రాబడిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో సఖ్యత పెరిగే అవకాశం ఉంది.

కన్యరాశి:

ఈరోజు అంతా వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి మరియు ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఎటువంటి ప్రయత్నం చేసిన లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రముఖులకు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు.

తులారాశి:

ప్రతి మరియు వ్యాపారాలలో అంచనాలకు తగ్గట్టుగానే రాబడి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంది. తోబుట్టువులతో ఉన్న ఆస్తివివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నంలో శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి:

కుటుంబ జీవితము ఆనందంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగ జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.

ధనస్సు రాశి:

వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. సమస్యలు మరియు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇటువంటి పని చేసిన ఫలితం ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన స్థాయికి మించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రేమా వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి.

మకర రాశి:

రోజంతా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి మరియు ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఆర్థిక ప్రయత్నాలు మరియు ఆర్థిక లావాదేవీలకు ఇది సరైన సమయం. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా ఆదుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి.

కుంభరాశి:

వృత్తి మరియు ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. లక్ష్యాలు మరియు బాధ్యతలు పెరుగుతాయి.వ్యాపారంలో తీరిక ఉండదు. స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం. పెళ్లి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

మీనరాశి:

రోజుల్లో ఎక్కువ భాగం అనుకూలంగా ఉంది. వృత్తి మరియు ఉద్యోగాలు హ్యాపీగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తయి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారడానికి వి సరైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now