Todays Horoscope: ఈ 3 రాశుల వారికి ఈరోజు తిరుగులేదు.. 12 రాశుల దిన ఫలాలు ఇవే..
ఏప్రిల్ 22, 2025 మేష రాశి వారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. నేడు మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇవే.
మేషరాశి:
అనుకోకుండా శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు పూర్తి అవుతాయి. వ్యక్తిగత సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ఆదాయంలో ఆశించినంత పెరుగుదల ఉంటుంది. వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులు ఆశించిన సమాచారం పొందుతారు.
వృషభ రాశి:
ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల ఇబ్బందులు తప్పవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. వృత్తి మరియు ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
మిథున రాశి:
ఈరోజు అంతా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి మరియు వ్యాపారంలో బాగా పురోగతి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విద్యార్థులు చదువులతో పాటు పోటీ పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి మరియు ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వలన బాగా లాభాలు పొందుతారు. అనవసరమైన పరిచయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
సింహరాశి:
నిదానంగా ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పరంగా కొత్త పుంతలు తొక్కుతారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. శుభవార్తలు వింటారు.
కన్యరాశి:
రోజంతా సాఫీగా సాగుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి మరియు ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయ ప్రయత్నాలకు అనుకూల సమయం. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.
తులారాశి:
కుటుంబంలో శుభ పరిణామం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. అనారోగ్యం నుంచి ఒక సమానం పొందుతారు. ఆర్థిక పనులు పూర్తవుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో తీరిక ఉండదు. ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారాల మీద శ్రద్ధ వహించాలి. కొందరు మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చెక్కబడతాయి. కొందరు బంధువుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్ వస్తుంది.
ధనస్సు రాశి:
అనుకున్న విధంగా ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఏ పని చేసినా నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మకర రాశి:
శుభవార్తలు వింటారు. వృత్తి మరియు వ్యాపారంలో సొంత ఆలోచనల వలన బాగా లాభాలు పొందుతారు. మీ పనితీరుతో ఉద్యోగంలో అధికారులను ఆకట్టుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. ఆదాయం ఆరోగ్యం బాగుంటాయి. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
కుంభరాశి:
వృత్తి మరియు వ్యాపారంలో మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు అనుకూల సమయం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
మీన రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఇంట బయట సమయం అనుకూలంగా ఉంది. వృత్తి మరియు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వలన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో వాగ్దానాలు చేయకూడదు. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం వస్తుంది.