Todays Horoscope: ఈ రాశుల వారికి ఉద్యోగంలో పదోన్నతి.. నేడు 12 రాశుల రాశి ఫలాలు..
నేడు ఏప్రిల్ 11, 2025 నాటి 12 రాశుల దిన ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నేడు మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల రాశి ఫలాలు ఇవే.
మేష రాశి:
ఆదాయం బాగా పెరుగుతుంది కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇతరులకు డబ్బులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తి మరియు ఉద్యోగంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభ రాశి:
సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల మీద పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూల సమయం. వ్యక్తిగత సమస్యలు కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంది.
మిథున రాశి:
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. అనేక ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం పొందుతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పొందుతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి:
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి. వృత్తి మరియు వ్యాపారంలో మీరు ఊహించిన స్థాయిలో రాబడి పొందుతారు. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
సింహరాశి:
ఇంట మరి బయట ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం తో పాటు కుటుంబంలో కూడా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితులు మరియు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి జీవితం బిజీగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాసం వస్తుంది.
కన్య రాశి:
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మీ సలహాలు అధికారులకు బాగా కలిసి వస్తాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, టెక్నాలజీ టెక్నికల్ నిపుణులకు తీరిక ఉండని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి మంచి అవకాశాలు వస్తాయి.
తులారాశి:
ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనేక ఆదాయ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. సోదరులతో ఉన్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో అధికారులతో సామారస్యం పెరిగి అవకాశం ఉంది. హోదా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక సమస్యలనుంచి బయటపడతారు. వృత్తి మరియు వ్యాపారం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీరు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
ధనస్సు రాశి:
ఆదాయం నిలకడగా ముందుకు సాగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. వృత్తి మరియు ఉద్యోగం అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నంలో శుభవార్తలు వింటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకం లభిస్తాయి. ఉద్యోగంలో అధికార యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలి అని ప్రయత్నించడం విరమించుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారంలో తీరిక ఉండదు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభరాశి:
వృత్తిిమరియు ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనేక ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఎవరిని నమ్మకూడదు. ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి:
గతంలో కంటే ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక ఆదాయ ప్రయత్నాలు లాభాలను ఇస్తాయి. వృత్తి మరియు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారంలో మార్పులు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.