Unidentified assailants stole gold: వృద్ధుని వద్ద బంగారం చోరీ

Gold chain theft
Gold chain theft

Unidentified assailants stole gold: కోరుట్ల/జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఆగస్టు 23 (ప్రజా శంఖారావం): కోరుట్ల పట్టణ కేంద్రంలోని ఇందిరా రోడ్డు ప్రాంతంలో మిట్టపల్లి భూమయ్య అనే వృద్ధుని వద్ద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం బంగారం చోరీ చేశారు. టీవీఎస్ ఎక్సెల్ లూనాపై వెళ్తున్న వృద్ధుని వద్ద దుండగులు తాము పోలీసులమంటూ కట్టు కథ చెప్పి వృద్ధుని మెడలో ఉన్న బంగారం గొలుసు, ఉంగరం ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయాడు. దుండగులు అపహరించిన బంగారం ఒకటిన్నర తులం ఉంటుందని బాధితుడు పోలీసులకు తెలిపాడు. స్థానికంగా ఉన్న సిసి కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సదరు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now