Vastu Tips: అక్వేరియంలో ఏ కలర్ చేపలు.. అదృష్టాన్ని, ధనాన్ని కలిగిస్తాయో తెలుసా..

Aquarium
Aquarium

Vastu Tips: అక్వేరియంలో ఏ కలర్ చేపలు.. అదృష్టాన్ని, ధనాన్ని కలిగిస్తాయో తెలుసా..

 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం చాలా శుభప్రదంగా చెబుతారు. చేపల ఎక్వేరియం ఇంటికి అందాన్ని పెంచడమే కాకుండా ఆ ఇంట్లో సానుకూల శక్తిని కూడా పెరిగేలా చేస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఇంట్లో నిస్తేజమైన ప్రకాశాన్ని తొలగిపోయేలా చేస్తుంది. కానీ దీనిని ఇంట్లో పెట్టుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. వాస్తు శాస్త్రంలో ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ఆ ఇంట్లో ప్రశాంతత అలాగే సంపద పెరిగేలాగా కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలు చెప్పబడ్డాయి. ఇటువంటి నియమాలలో ఇంట్లో చేపల ఎక్వేరియం సరైన దిశలో పెట్టుకోవడం కూడా ఒకటి.

ఇది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో అక్వేరియం సరైన దిశలో వాస్త నియమాల ప్రకారం పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో సంపాద మరియు శ్రేయస్సు పుష్కలంగా ఉంటాయి. చేపల అక్వేరియం లో నీటి మూలకం ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అక్వేరియంలో ఉండే చేపల సందడి మరియు నీటి కదలిక వంటివి ఆ ఇంట్లో లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. ఆ ఇంట్లో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది. అక్వేరియంలో ఉండే చేపల కదలిక ఆ ఇంట్లో చురుకుదనం అలాగే ధనం పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఒకవేళ చేపల అక్వేరియంలో ఉన్న చేప చనిపోయినట్లయితే ఆ ఇంట్లో ఏదో పెద్ద ఇబ్బందిని అది తీసుకుందని చాలామంది నమ్ముతారు. చేపల అక్వేరియం ఉన్న ఇంట్లో మనసుకు శాంతి కూడా ఉంటుందే.

దానిని చూస్తే మనసు ఏకాగ్రత చెందుతుంది. కుటుంబంలో మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఇంట్లో చేపల అక్వేరియం ఈశాన్య దిశలో పెట్టడం చాలా శుభప్రదంగా చెబుతారు. ఉత్తర దిశలో దీనిని పెట్టుకున్నట్లయితే వ్యాపారంలో లేదా కెరియర్లో విజయం సాధిస్తారు. అయితే చేపల అక్వేరియం దక్షిణ దిశలో పెట్టినట్లయితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సంభవించవచ్చు. నైరుతి దిశలో కూడా అక్వేరియం పెట్టకూడదు. బెడ్ రూమ్ లేదా వంటగది వంటి ప్రదేశాలలో పెట్టడం వలన వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడవచ్చు. అక్వేరియంలో ఉండే చేపల సంఖ్య ఎప్పుడు బేసిగా ఉండాలి. 7, 9 లేదా 11 ఇలా బేసి సంఖ్యలో చేపలను ఉంచాలి. ముఖ్యంగా అక్వేరియంలో ఏడు బంగారు చేపలు ఒక నల్ల చేపను చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now