Todays Gold Rate: ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారం పైన ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఆల్ టైం హై రికార్డుకు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం కూడా బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే మన దేశం మార్కెట్లో బంగారానికి మరియు వెండి కి ఎల్లప్పుడూ డిమాండ్ బాగా ఉంటుంది. కొన్నిసార్లు వీటి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక జూన్ 22, 2025 ఆదివారం రోజున మన దేశం మార్కెట్లో స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,750, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,350 గా ఉన్నాయి.
ఇక మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,000 గా ఉంది. దేశంలో ఉన్న పలు ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,750, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,350 గా ఉన్నాయి. ఈ నగరాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,20,000. ఇక ఢిల్లీ నగరంలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,900, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,500, కిలో వెండి ధర రూ.1,10,000 గా ఉన్నాయి.