Chanakya: కొంతమంది ఎంత పెద్ద సమస్యలు అయినా కూడా టెన్షన్ పడకుండా చాలా ఈజీగా పరిష్కరిస్తారు. మరి కొంతమంది మాత్రం చిన్న చిన్న సమస్యలకు కూడా భయాందోళనకు లోనవుతారు. ఈ కష్టాలను తట్టుకోలేక తమను తాము వాళ్ళు అసమర్థులుగా భావిస్తారు. ఇటువంటి వారి కోసం ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో ఐదు విషయాల గురించి తెలిపారు. కష్ట సమయంలో తెలివితేటలను ఉపయోగించి ఆ సమస్య నుంచి బయటపడిన వాళ్లను అపర చానిక్యుడు అని పిలుస్తారు. మనదేశంలో ఆచార్య చాణిక్యుడికి గొప్ప స్థానం ఇవ్వబడింది. చాణిక్యుడు గొప్ప సలహాదారు మాత్రమే కాదు గొప్ప వ్యూహ కర్త, తత్వవేత్త.
చాణిక్యుడికి వేదాలు మరియు పురాణాల గురించి కూడా పూర్తిగా అవగాహన ఉంది. కష్టంలో ఉన్నప్పుడు మనం ఈ ఐదు సూత్రాలను పాటించాలి. ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి తప్పించుకోవాలి అని అనుకోకూడదు. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి పక్కా ప్లానింగ్ తో ఉండాలి. సమయం తీసుకుని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఎదురైనప్పుడు సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. సమస్య నుంచి పారిపోకుండా దానిని ఎదుర్కొనే లాగా మీరు రెడీగా ఉండాలి.
సమస్యలు వచ్చిన సమయంలో సహనం కోల్పోకూడదు. ఎటువంటి సమస్యలు అయినా కూడా సానుకూల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏవైనా సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఓపికగా ఉండాలి. ఓర్పుతో, నేర్పుతో ఆ సమస్యను అధిగమించేలాగా ప్రయత్నించాలి. కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని బాధ్యతగా తీసుకొని నెరవేర్చడం ఆ కుటుంబ పెద్దల మొదటి కర్తవ్యం అని చెప్పాలి. కుటుంబ సభ్యులకు సమస్యల నుంచి బయట పడేసేందుకు కుటుంబ పెద్దలు చర్యలు తీసుకోవాలి. డబ్బును ఆదా చేయడం అలవాటు చేసుకోవాలి. మీకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు డబ్బు చాలా అవసరమవుతుంది.