Poor CIBIL Score: చిన్న చిన్న ఆర్థిక అవసరాల కోసం చాలామంది బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకుంటారు. అయితే వ్యక్తిగత రుణం తీసుకుంటున్న సమయంలో సిబిల్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉన్న సమయంలో మాత్రమే మీకు బ్యాంకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీకు తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కూడా మీరు బ్యాంకులో రూ.3 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 510 ఉన్నట్లయితే మీరు బ్యాంకులో లోన్ పొందడం చాలా కష్టం. సిబిల్ స్కోర్ మీ ఆర్థిక క్రమశిక్షణను చూపిస్తుంది. కాబట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో మీ సిబిల్ స్కోర్ ముఖ్యపాత్ర వహిస్తుంది.
సిబిల్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని చాలా తక్కువగా పరిగణిస్తారు. ఒకవేళ ప్రస్తుతం మీకు సిబిల్ స్కోర్ 510 ఉన్నట్లయితే గతంలో మీరు రుణ వాయిదాలు చాలా ఆలస్యంగా చెల్లించి ఉండవచ్చు అని అర్థం లేదా మీకు క్రెడిట్ పరిమితి మీరు ఎక్కువగా వాడి ఉండవచ్చు అని అర్థం. మీ సిబిల్ స్కోర్ మీ ఆర్థిక ప్రణాళిక మెరుగ్గా లేదని సూచిస్తుంది. బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ కంపెనీలు ముఖ్యంగా పర్సనల్ లోన్ ఇచ్చే సమయంలో సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి.
మీరు బాధ్యతగా రుణాలను చెల్లిస్తారు అని చెప్పడానికి మీ సిబిల్ స్కోర్ సూచిస్తుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 510 కంటే తక్కువగా ఉన్నట్లయితే మీరు బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ కంపెనీ లో నుంచి 3 లక్షల పర్సనల్ రుణం పొందడం చాలా కష్టం అని చెప్పాలి.510 సిబిల్ స్కోర్ మీ గత రుణ చరిత్రలో ఏవో సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. ఒకవేళ ఈ సిబిల్ స్కోర్ తో కూడా మీరు బ్యాంకు నుంచి రుణం పొందినట్లయితే అది ఎక్కువ వడ్డీ రేటు తో, పి టు పి ల్యాండింగ్ వంటి రిస్క్ తో కూడిన మార్గాల ద్వారా మాత్రమే రుణం లభించే అవకాశం ఉంటుంది.