Donation: ఆర్మూర్ టౌన్, మార్చి 18 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం హుస్నాబాద్ గల్లి పాత బస్టాండ్ లోని 3వ తర్ప సంఘ భవనానికి ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ 50 వేల రూపాయల విరాళాన్ని మంగళవారం అందజేశారు. 3వ తర్ప అధ్యక్షులు యగ్నేష్, సంఘం సభ్యులకు ఈ విరాళాన్ని ఆయన అందజేశారు. భవిష్యత్తులో సంఘమ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ తర్ప ఉపాధ్యక్షులు గురుడు రామచందర్, దోమల శ్రీనివాస్, కార్యదర్శి మేకల మోహన్, కోశాధికారి అంబటి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు బడుగు శ్రీనివాస్, చిలివేరి లింబాద్రి, అంబటి గణపతి, ఇఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు, రాంప్రసాద్, కొండి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
Donation: పద్మశాలి భవనానికి 50వేల విరాళం
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now