Oldwoman Gold chain theft: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 23 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. శుక్రవారం ఈ ఘటన ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో చోటుచేసుకుంది. పేర్కిట్ గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి నర్సు బాయ్ బంధువుల పెళ్ళికని పెర్కిట్ చౌరస్తాలో ఆటో ఎక్కింది. మరో మహిళ ఆటోలో ఆపాటికె ఎక్కి కూర్చుంది. ఆటోలో ఉన్న మహిళలను మామిడిపల్లి చౌరస్తాలో దింపి బాధితురాలిని పెళ్లి వద్ద దింపుతానని ఆటో డ్రైవర్ వద్దురాలితో నమ్మబలికాడు. ఆటో డ్రైవర్ మాటలను నమ్మిన బాధితురాలు సరే అని చెప్పింది. ఆటో డ్రైవర్ మామిడిపల్లి శివారులోని అయ్యప్ప ఆలయం సమీపంలోకి ఆటోను తీసుకెళ్లాడు. రోడ్డు పక్కన ఆటోను నిలిపి ఇదివరకే ఆటోలో ఉన్న మరో మహిళతో కలిసి ఆటో డ్రైవర్ వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు చైన్ ను లాక్కొని బాధితురాలని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన ఈ ఘటనపై ఆర్మూర్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
Oldwoman Gold chain theft: సినీఫక్కీలో బంగారు గొలుసు చోరీ
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now