TRAFFIC RULES: న్యూ ట్రాఫిక్ రూల్స్.. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఇక అంతే..
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ నియమాలను అమలులోకి తెచ్చింది. ఈ ప్రమాదాలలో కొంతవరకు ప్రమాదాలు మైనర్లు వాహనాలను నడపడం వలన జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతంలో మైనర్లకు వాహనాలు ఇచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా దీన్ని అరికట్టడానికి హైదరాబాద్ నగర పోలీసులు కీలక చర్యలను తీసుకున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న ట్రాఫిక్ నిబంధనలను సవరించే కొన్ని కీలక సవరణలను చేపట్టారు. హైదరాబాదు నగరంలో మైనర్లు రోడ్లపై వాహనాలు నడుపుతూ ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్
ఈ క్రమంలో హైదరాబాద్ నగరం అంతట ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అరికట్టడానికి హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం నుంచి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ డ్రైవ్ సమయంలో ఒకవేళ మైనర్లు వాహనం నడుపుతున్నట్లు పోలీసులకు పట్టుపడితే వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు ఉల్లంఘన దారులపై చట్టపరమైన చర్యలను కూడా తీసుకుంటారు. 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వాహనం నడపడం నిషేధం. ఒకవేళ మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడినట్లయితే వాహన యజమాని అంటే వారి తల్లిదండ్రులు లేదా నమోదీత యాజమాని కూడా జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది.
పోలీసులు చేపట్టబోయే చట్టపరమైన చర్య
పోలీసులు చేపట్టబోయే చట్టపరమైన చర్యలకు వాళ్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 1988 ఎంబి చట్టంలోని శిక్షణ 1999 ఏ ప్రకారం మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లైతే బాల నేరస్తులకు జరిమానా మరియు జైలు శిక్ష విధిస్తారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు ఆ వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు చేస్తారు. అలాగే ఆ బాల నేరస్థుడికి 25 సంవత్సరాల వయసు వచ్చేవరకు లెర్నర్స్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హత ఉండదని అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ జాయింట్ కమిషనర్ డి జోయెల్ డెవిస్ తల్లితండ్రులకు మరియు సంరక్షకులకు తమ మైనర్ పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వద్దని తెలిపారు.