MS DHONI: తన రిటైర్మెంట్ పై ధోని కీలక వ్యాఖ్యలు..

MS Dhoni
MS Dhoni

MS DHONI: తన రిటైర్మెంట్ పై ధోని కీలక వ్యాఖ్యలు..

ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై స్పందించారు. తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఎక్కడ చెప్పలేదని, తన క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ధోని స్పష్టం చేశారు. ఈ సీజన్ తర్వాత IPL కు తాను రిటైర్మెంట్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై ధోని స్పందించారు. తనకు ఆడటానికి ఇంకా వయసు ఉందని, తాను ఇప్పుడే IPL నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకోవడం లేదని అన్నారు.

ప్రస్తుతం తనకు 43 ఏళ్ల వయసు ఉందని, తాను ఇంకా ఆడటానికి ఫిట్ గా ఉన్నట్లు చెప్పారు. తనకు తన బాడీ ఆడటానికి సహకరిస్తుందని తెలిపారు. వచ్చే సీజన్ లో IPL ఆడతానో లేదో చెప్పడానికి ఇంకా సమయం ఉందని, తనపై ఆటపై పుకార్లు చేయొద్దని కోరారు. అలాంటిది ఎమైన ఉంటే తానే ప్రకటిస్తానని తన అభిమానులు ఎవరు నిరుస్సాహా పడాల్సిన అవసరం లేదని మరోసారి ధోని స్పష్టం చేస్తూ, రిటైర్మెంట్ ప్రచారంపై వస్తున్న పుకార్లను ఆయన కొట్టి పారేశారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now