RTC BUS: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు మే ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నారు. ప్రభుత్వం కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత మరియు పెన్షన్ వంటి డిమాండ్లపై స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగులు మరియు కార్మిక సంఘాలు ఇచ్చిన హెచ్చరికలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. జేఏసీ మే ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నిర్వహించేందుకు స్పష్టంగా ప్రకటించింది. జనవరి 27న డిమాండ్ల పరిష్కారం కోసం యాజమాన్యానికి నోటీసులు పంపించినప్పటికీ ప్రభుత్వ ఎండి స్థాయిల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చివరకు కార్మికులు సమ్మే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో భాగంగానే ఆర్టీసీ జేఏసీ నేతల సంస్థ ఎండి సజ్జనార్కు మరియు లేబర్ కమిషనర్ కు అధికారికంగా సమ్మె నోటీసులను కూడా పంపించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అత్యవసరమైన రవాణా సేవలుగా నిలిచిన ఆర్టీసీ మరొకసారి సుదీర్ఘ సమ్మెకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. కార్మికులకు తగిన గౌరవం లేకుండా, వేతనాలు ఆలస్యం మరియు ఉద్యోగ భద్రతపై అస్పష్టత వంటి అనేక సమస్యలతో విసిగిపోయిన ఆర్టీసీ కార్మికులు ఈసారి గట్టిగానే సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మే నెల ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ రవాణా సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. గతంలోనే జనవరి 27న ఆర్టీసీ జేఏసీ నేతలు తమ సమస్యలన్నీటిపై అధికారులకు నోటీసులను అందజేశారు. అప్పటినుంచి నిశ్శబ్దంగా ఉన్న ప్రభుత్వం ఏప్రిల్ నెల వచ్చినా కూడా స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికులకు చివరకు సమ్మెబాట చేపట్టారు. అయితే ఇది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు ప్రజల సమస్య కూడా. ఎందుకంటే ఒక రోజులో ఆర్టీసీ బస్సుల ద్వారా లక్షల మంది ఉద్యోగులు, విద్యార్థులు మరియు మహిళలు బస్సులను నమ్ముకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి రవాణా సంస్థ నిలిచిపోతే స్కూల్ లకు, కార్యాలయాలకు మరియు ఆస్పత్రులకు వెళ్లడం చాలా కష్టం అవుతుంది.