Todays Gold Rate: భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే..
నిన్నటి వరకు బంగారం ధరలలో కొంచెం తగ్గుదల కనిపించినప్పటికీ నేడు మే 18, ఆదివారం మాత్రం బంగారం ధరలలో ఎటువంటి మార్పు జరగలేదు. నేడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మన దేశ మార్కెట్లో గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. గతంలో తులం బంగారం ధర లక్ష రూపాయల వరకు చేరుకున్న ప్రస్తుతం మాత్రం అది 95 వేలకు పడిపోయింది. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధర 5000 వరకు తగ్గినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే రకమైన మార్పులు కనిపిస్తున్నాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టడంతో అలాగే బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ తగ్గడం వలన కూడా మార్కెట్లో బంగారం పతనానికి కారణం అంటూ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఈ తిరోగమనం కొద్ది రోజులు మాత్రమే అని నిపుణులు చెప్తున్నారు. మార్కెట్ విశ్లేషకులు 2013లో బంగారం ధరలు భారీగా తగ్గిన దశను గుర్తు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడితే బంగారం ధరలు ఔన్స్ కు ₹3,230 నుంచి ₹1,820 తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే గనుక జరిగితే మన దేశంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గొచ్చు. 10 గ్రాములకు 55000 నుంచి 60 వేల మధ్య బంగారం ధరలు స్థిరపడే అవకాశం ఉందని మార్కెట్ ని పనులు చెబుతున్నారు.
మే 18, 2025 ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.87,350, 24 క్యారెట్ల ధర రూ.95,200.
ముంబై, కోల్కత్తా, చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో 22 క్యారెట్ల ధర రూ.87,200, 24 క్యారెట్ల ధర రూ.95,130.
ఇక మన దేశం మార్కెట్లో కూడా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం రోజు కిలో వెండి ధర రూ.97,000 గా ఉంది. నేడు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,08,000.