Todays rasi Phalalu: ఈ రాశుల వారికి ఈ వారం ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వార ఫలాలు ఇవే..
మే 18 నుంచి మే 24, 2025 మేషరాశి వారికి ఉద్యోగంలో ప్రాముఖ్యత లభిస్తుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయంలో బాగా పెరుగుదల ఉంటుంది. వీరికి ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. మేష రాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వార ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:
వీరికి ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు పొందుతారు. వృత్తి మరియు వ్యాపారంలో బాగా డిమాండ్ ఉంటుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు జరుగుతాయి. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. కొంచెం మానసిక వత్తిడి ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమా వ్యవహారాలు కూడా సంతృప్తిగా సాగిపోతాయి.
వృషభ రాశి:
వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయంలో బాగా పెరుగుదల ఉంటుంది. వీరికి కూడా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ వారం అంతా సంతోషంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో సామరస్యం ఏర్పడుతుంది. మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వలన బాగా లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
మిథున రాశి:
ఈ వారం అంతా ఆనందంగా గడిచిపోతుంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలలో సఫలం అవుతారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో మీ పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి:
ఈ వారం అంతా వీరికి సంతోషంగా సాగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారంలో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లాభాన్ని కలిగించే పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ విషయంలో జాగ్రత్తపడాలి.
సింహరాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. జీవితంలో పని భారం పెరుగుతుంది. వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి మరియు ఉద్యోగంలో పని భారం పెరిగిన కూడా ఫలితం కూడా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. ప్రేమ వ్యవహారంలో కొత్త పుంతలు తొక్కుతారు.. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
కన్య రాశి:
వ్యక్తిగత సమస్యల నుంచి ఒక సమానం పొందుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. వృత్తి మరియు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. అనుకున్న పనిలు పూర్తి అవుతాయి. చదువుల పిల్లలు శ్రమ పడాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
తులారాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో మీ మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. పెళ్లి ప్రయత్నాలకు అనుకూల స్పందన వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. అనేక ఆదాయ ప్రయత్నాలకు ఇది మంచి సమయం. షేర్ల వలన బాగా లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ధనస్సు రాశి:
ఈ వారం అంతా వీరికి ఆనందంగా గడుస్తుంది. ఇంటా బయట మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చదువుల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.
మకర రాశి:
ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అంచనాలకు నుంచి లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలకు సమయము అనుకూలంగా ఉంది.ధనపరంగా ఈ వారం అంతా హ్యాపీగా సాగుతుంది. విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. చదువుల్లో పిల్లలు బాగా శ్రమ పడాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
కుంభరాశి:
ఉద్యోగంలో డిమాండ్ ఉంటుంది. వ్యాపారంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తింటా బయట అనుకూలంగా ఉంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఆదాయం నిలకడగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం పొందుతారు. ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
మీనరాశి:
ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. అధికారుల నమ్మకం పొందుతారు. ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. విదేశాలలో ఉన్న పిల్లలనుంచి శుభవార్తలు వింటారు.