Todays Gold Rate: గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు ఆల్ టైం హై రికార్డు తులం లక్ష రూపాయలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం 95 వేలకు చేరుకున్న తులం బంగారం ధరలు ఆ తర్వాత మళ్లీ పెరిగి 98 వేలకు చేరుకున్నాయి.
తాజాగా మళ్లీ బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. మే 29, 2025 పది వెబ్సైట్లో ఉన్న ధరల ప్రకారం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.97,470, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,340. తులం బంగారంపై పది రూపాయలు ధర తగ్గింది. అలాగే కిలో వెండి పై కూడా ₹100 తగ్గినట్లు తెలుస్తుంది.
పలు ప్రధాన నగరాలలో బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.97,470, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.89,340. అలాగే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.
ఇక విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై మరియు బెంగళూరు నగరాలలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.97,470, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.89,340. అలాగే కిలో వెండి ధర రూ.99,900 గా ఉంది.
ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.97,620, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.89, 490 గా ఉంది. కిలో వెండి ధర ఈరోజు రూ.99,900 గా ఉంది.
బంగారం మరియు వెండి ధరలు ఈరోజు ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా గుర్తించగలరు.