TG Govt: తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఏడాది సెప్టెంబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి జిల్లా అధికారులకు తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెల 2017 నుంచి మార్చి నెల 2024 వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ప్రభుత్వం లెక్కలు సేకరించి చేనేత రుణమాఫీ అర్హతలపైన ఒక స్పష్టత తెలిపింది.
రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో హామీ అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు వృత్తి అవసరాల కోసం రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు ఊరట లభించబోతుంది. గడిచిన సెప్టెంబర్ నెలలోనే చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2024 మధ్యలో చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఒక్కో చేనేత కార్మికుడికి రూ.లక్ష లోపు ఉన్న రుణాలు మాఫీ కానున్నాయి. ఈ క్రమంలో కార్మికులు గత కొంతకాలం నుంచి కొత్త రుణాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ మార్గదర్శకాలు వచ్చిన క్రమంలో అధికారులు చేనేత కార్మికుల మాఫీ ప్రక్రియ అతి త్వరగా పూర్తిచేయాలని కార్మికులు విన్నపించుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలతో వీవర్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, వర్కింగ్ క్యాపిటల్ కింద చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి.