ACB Trap: ఎసిబి వలలో ఎంవిఐ

ACB Trap: ఆర్మూర్, ఆగస్టు 21 (ప్రజా శంఖారావం): అవినీతి నిరోధక శాఖ అధికారులు రోజుకో ఒక అవినీతి అధికారులను పట్టుకుంటున్న ప్రభుత్వ అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి 25 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు.

నిజామాబాద్ కేంద్రానికి చెందిన ఆర్టీవో ఏజెంట్ వద్ద ఒక ఫైలు పై సంతకం చేయడానికి సదరు ఏజెంట్ వద్ద ఎంవిఐ లంచం డిమాండ్ చేసినట్లుగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇరువురికి కుదిరిన ఒప్పందంలో భాగంగా సదరు ఏజెంట్ వద్ద 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబి డిఎస్పీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now