RTC Bus Accident: బ్రేకులు ఫెయిలై చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Rtc Bus Accident
Rtc Bus Accident

RTC Bus Accident: ఎలారెడ్డి, ఆగష్టు 26 (ప్రజా శంఖారావం): బ్రేకులు ఫెయిలవడంతో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటన ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు ప్రయాణికులతో వెళుతుంది. బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో బస్సు డ్రైవర్ చెట్టుకు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో క్షతగాత్రులను ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now