Taskforce Police Rideing: వేల్పూర్, ఆగస్టు 26 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై సోమవారం మధ్యాహ్నం జిల్లా టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై వచ్చిన సమాచారంతో దాడి చేయగా పేకాట ఆడుతున్న ఐదుగురు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 45వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి స్థానిక వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now