Doctor Negligence: జుక్కల్, ఆగష్టు 27 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పిట్లం మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన శంకర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు హేమంత్ (3)కు తీవ్ర జ్వరం రావడంతో సోమవారం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆస్పత్రిలో బాలునికి గ్లూకోజ్ పెట్టి వదిలేశారని, ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదని బాలుని తండ్రి ఆరోపించారు. తమ కుమారున్ని రాత్రి వైద్యులెవరు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పినట్లు తెలిపారు. దీంతో మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.
Doctor Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now