FREE BUS: ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం మరో శుభవార్త.. ఇక ఆధార్ లేకపోయినా మహిళలకు ప్రయాణం

FREE BUS
FREE BUS

FREE BUS: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మి యోజన ప్రారంభించిన సంగతి అందరికీ. అయితే ఈ బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్ కార్డు మాత్రమే కాకుండా ఇతర గుర్తింపు పత్రాలు అయిన చెల్లు బాటు అవుతాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రజలలో ఇప్పటికే విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ పథకం ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద వర్గాల మహిళలకు చాలా మేలు కలిగిస్తుంది.

ప్రతిరోజు కార్యాలయాలకు, బస్తీలకు, మార్కెట్లకు బస్సులో ప్రయాణించే మహిళల కోసం ఇది ఆర్థికంగా చాలా పెద్ద ఊరటగా నిలిచింది. తాజాగా మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోక శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు హామీలలో మహాలక్ష్మి పథకం ఇప్పటికే అమలు అయిన సంగతి తెలిసిందే. టి ఎస్ ఆర్ టి సి ఈ పథకంలో భాగంగా మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో ఎటువంటి చార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైన తొలి రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.

తాజాగా టి ఎస్ ఆర్ టి సి ఎండి వీసి సజ్జనార్ మహాలక్ష్మి పథకం గురించి ఒక ముఖ్యమైన విషయం తెలిపారు. అయితే ఈ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడానికి కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూపించాల్సిన అవసరం లేదు, ఓటర్ ఐడి, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను కూడా చూపించవచ్చు అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఒకవేళ ఆధార్ కార్డు లేని వారు ఇతర గుర్తింపు పత్రాలను కూడా చూపించి ఈ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now