Todays Horoscope: నేడు మే 10, 2025 మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కొద్దిపాటి మార్పులు చేయడం వలన వృత్తి మరియు వ్యాపారంలో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయానికి మరియు ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. షేర్ల వలన బాగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు.
వృషభ రాశి: ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్ల వలన లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారంలో లాభాలు బాగా ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు.
మిథున రాశి: అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వీళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. చేతికి రావలసిన డబ్బు తోపాటు షేర్లు మరియు స్పెక్యులేషన్ ల వలన కూడా బాగా లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగా గడిస్తారు.ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి: ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో తీరిక ఉండదు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడంలో తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
సింహరాశి: ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. కొందరు మిత్రుల వలన నష్టపోతారు. ఆదాయానికి తగినట్లు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో రాబడి బాగా ఉంటుంది. ఆర్థికపరంగా వాగ్దానాలు చేయకూడదు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య రాశి: ఆదాయం పెరుగుతుంది. అనేక ఆదాయం మార్గాల మీద శ్రద్ధ వహిస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి బాగా ఉంటుంది. ఉద్యోగంలో జీవిత పద్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు వలన బాగా లాభాలు పొందుతారు. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తులారాశి: ఈరోజు అంతా వీరికి ఆనందంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఉద్యోగంలో కొద్దిగా ఓర్పుగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. అనేక ఆదాయ ప్రయత్నాలకు ఇది సరైన సమయం. ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి: నిరుద్యోగు లు విదేశాలనుంచి మంచి ఆఫర్లు అందుకుంటారు. బంధువులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక విషయాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇస్తాయి. వ్యాపారంలో పెట్టుబడికి తగిన లాభాలను అందుకుంటారు. ఆస్తి వివాదం ఇబ్బంది పెడుతుంది. వృత్తి మరియు ఉద్యోగంలో రాబడి బాగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక విషయాలలో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కొందరు మిత్రులకు సహాయపడతారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో మీ మీద అధికారులు ఆధారపడతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
మకర రాశి: ఆదాయం పెరుగుతుంది. ఏదో ఒక మార్గంలో ఆదాయం వస్తూనే ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో తీరిక ఉండదు. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఆశిస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం పొందు. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలకు పురోగతి ఉంటుంది.
కుంభరాశి: ఆదాయ ప్రయత్నాలు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరుగుతాయి. వృత్తి మరియు ఉద్యోగంలో డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.
మీనరాశి: వృత్తి మరియు ఉద్యోగం అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగంలో హోదా పెరగడంతోపాటు జీవిత పద్యాలు కూడా పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. అదనపు ఆదాయం మార్గాల మీద దృష్టి పెడతారు. వ్యాపారంలో మీ పెట్టుబడికి తగిన లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.