HEALTHY CHICKEN: మీరు అతిగా చికెన్ తింటున్నారా…! అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

HEALTHY CHICKEN
HEALTHY CHICKEN

HEALTHY CHICKEN: ప్రోటీన్ కోసం చూస్తున్న వాళ్లకు చికెన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డైట్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ తమ ప్లాన్ లో ఇది తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. కానీ చికెన్ లో ఉండే అన్ని భాగాలలో కూడా ఒకేలాగా ప్రోటీన్ ఉండదు అని మీరు తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఫిట్నెస్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఫిట్నెస్ కోసం ప్రయత్నించే వాళ్ల డైట్ లో ఎక్కువగా వినిపించే పేరు చికెన్. హెల్దీ డైట్ ప్లాన్ లో చికెన్ తప్పనిసరిగా ఉంటుంది. బాడీ బిల్డింగ్ చేస్తున్న వాళ్లైనా అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్ళైనా ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే ఆహారం గా చికెన్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నాన్ వెజ్ ప్రియులతో పాటు ఆరోగ్యం పై దృష్టి పెట్టే వాళ్లందరికీ కూడా చికెన్ మంచి ఆప్షన్. చికెన్ తక్కువ కొవ్వు మరియు అధిక ప్రోటీన్ లెవెల్స్ ను కలిగి ఉంటుంది.

అయితే చికెన్ లోని అన్ని భాగాలలో ఒకే రకంగా ప్రోటీన్ ఉండదు అని చాలామందికి తెలియదు. చికెన్ లోని కొన్ని భాగాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మరికొన్ని భాగాలలో తక్కువగా ఉంటుంది. అందుకే మీరు అధిక మొత్తంలో ప్రోటీన్ కావాలి అనుకుంటే ఏ భాగాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవాలి. ప్రోటీన్ మోతాదును అంచనా వేయాలి అనుకుంటే 100 గ్రాముల మాంసాన్ని స్టాండర్డ్ గా తీసుకోవాలి. ఎముకలు మరియు చర్మం లేకుండా ఉండాలి. ఒకవేళ ఎముకలు చర్మం ఉన్నట్లయితే మాంసం మీద లెక్క వేయడం కష్టం అవుతుంది.

ఎముకలు లేకుండా అలాగే చర్మం తీసేసిన మాంసంతో మాత్రమే ప్రోటీన్ పరిమాణం ఎంత ఉందో లెక్కించడం సులభం అవుతుంది. చికెన్ లో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్ అధిక మొత్తంలో ఉండడం వలన చాలామంది తమ డైట్లో భాగంగా చేర్చుకుంటారు. చికెన్ 100 గ్రాముల బ్రెస్ట్ ముక్కలు సుమారు 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని సమాచారం. మజిల్ బిల్డింగ్ చేసే వాళ్లకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 100 గ్రాముల డ్రంస్టిక్ లో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్ 100 గ్రాముల లెగ్ ముక్కలలో 28.3 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అలాగే చికెన్ 100 గ్రాముల రెక్కలలో 30.5 గ్రాముల వరకు ప్రోటీన్ అందుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now