Vantalakka: హీరోయిన్లకు మించిన అందంతో వంటలక్క కూతురు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Vantalakka
Vantalakka

Vantalakka: బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ వంటలక్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ లోని వంటలక్క పాత్రకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ వచ్చింది. ఈ వంటలక్క పేరు ప్రేమి విశ్వనాధ్. మరోసారి ఈమె కార్తీకదీపం 2 సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. దాదాపు 7 ఏళ్ల నుంచి బుల్లితెర మీద హై టి ఆర్ పి రేటింగ్ తో సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీకదీపం.

తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ అంటే అందరూ చెప్పే పేరు కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు భారీ గుర్తింపు వచ్చింది. సినిమాలలో ఉండే హీరో హీరోయిన్లకు మించిన క్రేజ్ వంటలు అక్క సొంతం చేసుకుంది. మరోసారి కార్తీక్, దీప కార్తీకదీపం 2 సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈమె మలయాళం లో కూడా పలు సీరియల్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే కార్తీకదీపం సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమె వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు. సోషల్ మీడియాలో ప్రేమీ విశ్వనాథ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇటీవల ఈమె తన కొడుకుతో చేసిన రూల్స్ సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈమె కూతురుకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అమ్మాయి ప్రేమి విశ్వనాథ సొంత కూతురు కాదు. సీరియల్ కూతురు మాత్రమే.

కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క కూతురు గాని నటించిన శౌర్య అందరికీ ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ చిన్నారి పేరు బేబీ కృతిక. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఈ చిన్నారి బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఈమెకు సినిమాలలో కూడా నటించే అవకాశం వచ్చింది. సోషల్ మీడియాలో కృతిక చాలా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కార్తీకదీపం సీరియల్ లో చాలా క్యూట్ గా ఉండే శౌర్య ప్రస్తుతం ఎంతో అందంగా తయారయ్యింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now