Business idea: చాలామంది కొబ్బరిని తీసుకున్న తర్వాత కొబ్బరి చిప్పలను పడేస్తూ ఉంటారు. కానీ అలా పడేసే కొబ్బరి చిప్పలతో కూడా భారీగా సంపాదించవచ్చు అని చాలామందికి తెలియదు. ప్రస్తుతం టన్ను కొబ్బరి పీచు ధర మార్కెట్లో రూ.26,500 గా ఉంది. గతంలో టన్ను కొబ్బరి పీచు ద్వారా రూ.7000 నుంచి రూ.8000 మధ్యలో ఉండేది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కొబ్బరి చిప్పలను తీసుకొని రండి డబ్బులను సంపాదించండి అనే ప్రచారం కూడా జరుగుతుంది. అలాగే కేరళ మరియు తమిళనాడు రాష్ట్రంలోని ఫ్యాక్టరీలకు ఎక్కువ మొత్తంలో కొబ్బరి చిప్పలు సప్లై జరుగుతుంది.
రాజస్థాన్ మరియు గుజరాత్ లోని ఫ్యాక్టరీలలో కొబ్బరి చిప్పలతో బొగ్గు ఎగుమతి కూడా భారీగా జరుగుతుంది. కొబ్బరి తీసేసిన కొబ్బరి చిప్పలు పర్యావరణానికి అనుకూలమైనవిగా మరియు బహుముఖ పదార్ధంగా ఉంటాయి. ఈ కొబ్బరి చిప్పలను ఫేస్ క్రీములు మరియు వాటర్ పెయింట్స్ లో కూడా ఉపయోగిస్తారు. అలాగే వీటిని బయోడిగ్రీడబుల్ గిన్నెలు, చెంచాలు అలాగే లాంప్ షెడ్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అలాగే వీటిని ఇంటి డెకరేషన్ కోసం ఉపయోగించే నగలు మరియు విండ్ చైన్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ కొబ్బరి చిప్పలను కాల్చి వాటిని ఇంధనం కూడా వాడుకోవచ్చు.
కొబ్బరి చిప్పతో తయారుచేసిన బొగ్గును గ్రిల్లింగ్ అలాగే వంట పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి చిప్పలను పగలగొట్టి ఆ పెంకులను మట్టిలో కలిపినట్లయితే ఎరువుగా కూడా పనిచేస్తుంది. అలాగే ఈ కొబ్బరి చిప్పలతో మొక్కలను పెంచే బుట్టలు కూడా రూపొందించుకోవచ్చు. ఈ కొబ్బరి చిప్పలను నీటి శుద్ధికరణ మరియు గాలి ఫిల్టర్లలో ఉపయోగించే ఉత్తేజిత కార్బన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటితో గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న గిన్నెలు, వంట పాత్రలు కూడా తయారుచేస్తారు. కొబ్బరి చిప్పలతో సంగీత వాయిద్యాలను కూడా తయారు చేసుకోవచ్చు.