Vastu Tips For Home: మీ ఇంట్లో ఈ దిశలో ఇది పెట్టడం వలన.. దోషాలన్నీ తొలగిపోతాయి

Vastu Tips For Home
Vastu Tips For Home

Vastu Tips For Home: చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుల గురించి కూడా చెప్పబడింది. ఇంట్లో పెట్టుకునే అద్దం గురించి కూడా అనేక నివారణలు వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. వాస్తుకు సంబంధించిన అనేక రహస్యాలు అద్దం వంటి వస్తువుల దాగి ఉన్నాయి అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దాన్ని సరైన దిశలో పెట్టడం వలన మీ ఇంట్లో సానుకూలత ఉంటుంది. ఇలా చేయడం వలన ఇంటికి సంబంధించిన అనేక ప్రధాన వాస్తు లోపాలు తొలగిపోతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఒక సాధారణ ప్రతిబింబాన్ని చూపించే వస్తువు మాత్రమే కాదు. మన ఇంట్లో పెట్టుకునే అద్దాలు ఇంట్లోకి అనుకూల శక్తిని పెంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కాబట్టి ఇంట్లో అద్దాన్ని సరైన దిశలో పెట్టడం చాలా అవసరం. అలాగే ఇంట్లో అద్దాన్ని తప్పుడు స్థానంలో పెడితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో అద్దాన్ని కాంతి వచ్చే దిశలలో అంటే ఇంట్లో తూర్పు లేదా ఉత్తర గోడలపై పెట్టడం మంచిది. ఎందుకంటే ఇంట్లో ఇది అసలు కాంతికి మరియు సానుకూల చెట్టుకి సంబంధించినవి. ఇంట్లో శక్తులను పెంచడానికి అద్దాలు పనిచేస్తాయి.

అవి అనేక వాస్తు దోషాలను కూడా తొలగిస్తాయి. ఇంట్లో లేదా వ్యాపారం చేసే దుకాణంలో వాయువ్య మూల కత్తిరించబడి ఉన్నట్లయితే ఆ భాగం యొక్క ఉత్తర గోడ పై నాలుగు అడుగుల వెడల్పు ఉన్న అద్దాన్ని పెట్టండి. ఇలా చేయడం వలన వాస్తు దోషం తొలగిపోతుంది. అలాగే ఈశాన్యంలో కత్తిరించబడి ఉంటే ఉత్తర గోడ పై కత్తిరించిన భాగం లోపల అద్దం పెట్టండి. ఒకవేళ మెట్ల దగ్గర ఉంటే ఇంటి ప్రధాన తలుపు దగ్గర అష్టభుజాకార అద్దాన్ని పెట్టుకోండి. బెడ్ రూమ్ లో అద్దాన్ని ఎప్పుడు పెట్టుకోకూడదు. భోజనం చేసే గదిలో అద్దం పెట్టడం వలన శుభ పరిణామాలు జరుగుతాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now