Armoor: పంద్రాగస్టుకు పట్టని పరిసరాల పరిశుభ్రత

Armoor Town
Armoor Town
– కంపు కొడుతున్న ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు
– మున్సిపల్ కార్యాలయంలో మూలన చెత్త
– వీరితో గ్రామీణ, పట్టణాభివృద్ధి సాధ్యమయ్యేనా..?

Armoor: ఆర్మూర్, ఆగష్టు 14 (ప్రజా శంఖారావం): Armoor/ వినే వారుంటే చెప్పేవారు ఎన్నైనా చెప్పవచ్చు అనే చందంగా తయారైంది ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల పరిస్థితి. పరిసరాల పరిశుభ్రత పాటించండి పట్టణ సుందరీకరణకు దోహదపడండి అనే కొటేషన్లు.. కొటేషన్లు గానే మిగిలిపోతున్నాయి. గ్రామీణ, పట్టణాభివృద్ధి (DEVELOPMENT) వైపు ప్రజలను చైతన్య పరచాల్సిన అధికారులే వారి కార్యాలయాల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను అపరిశుభ్రంగా ఉంచుతూ ఎదుటివారికి నీతులు, సూక్తులు బోధిస్తే దయ్యాలు వేదం వళ్ళిచ్చినట్లుగా ఉంది ఇక్కడి పరిస్థితి.

నిజామాబాద్ జిల్లా (NIZAMABAD DISTRICT) ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసర ప్రాంతాల అపరిశుభ్రత పై అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టొచ్చినట్లు కనబడుతుంది.కనీసం పంద్రాగస్టుకు (AUGUST 15th) పరిసర ప్రాంతాలైన శుభ్రపరుస్తారని ప్రజలు ఆశించారు. ఈ నేపథ్యంలోనే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న అధికారుల తీరును చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎదుటి వారికి నీతులు చెప్పడమే తప్ప మేము పాటించమన్నట్లుగా ఉన్న అధికారుల తీరును చూసి స్థానికులు ముక్కున వేలుసుకుంటున్నారు. ఒకవైపు వర్షాలు (RAINS) పడుతూ మడుగులలో నీరు నిలిచిపోతుండడంతో పట్టణంలో అనారోగ్యకరమైన (HEALTH ISSUES) వాతావరణం (WEATHER) ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల పరిసర ప్రాంతాలే ఇలా ఉంటే, పట్టణంలోని కాలనీల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదంటున్నారు పలువురు కాలనీ వాసులు.

Also Read: నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..!

ఉన్నతాధికారులు (HIGHER OFFICERS) తనికీ చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయాలను పరిశుభ్రం (CLEAN) చేస్తుంటారు. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోడానికి సంబంధిత కార్యాలయాలను అక్కడ ఉండే అధికారులు అలంకరణలో ముందుంటారు. కానీ పతాకావిష్కరణ కోసం వచ్చే ప్రజల కోసం కనీసం పరిశుభ్రత పాటించకపోవడం శోచనీయం. పంద్రాగస్టు సందర్భంగా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్, మండల పరిషత్, తాహాసిల్దార్, ఆర్ అండ్ బి కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితిపై ప్రజా శంఖారావం తెలుగు దినపత్రిక పరిశీలించిన సమయంలో కొన్ని కార్యాలయాల్లో అపరిశుభ్రతంగా ఉన్న ఫోటోలను చిత్రీకరించడం జరిగింది.

ముఖ్యంగా పట్టణ (TOWN) పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మున్సిపల్ కార్యాలయంలోనే చెత్తాచెదారం, దుర్గంధం వెదజల్లుతుండం, దోమలు ఉండడం పరిసర ప్రాంతాలను చూస్తే ఇదేనా పట్టణాభివృద్ధి అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా ఉద్యోగం (JOBS) చేసే పరిసర ప్రాంతాలపై ఆయా కార్యాలయాల అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు (LOCAL) అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు సంబంధిత కార్యాలయాల అధికారులకు ఏ విధమైన సూచనలు చేస్తారో వేచి చూడాలి.

Also Read: పెదవి దాటిన ప్రగల్బాలు.. పారిశుద్ధ్యం దరికి చేరని పార, గమేళా..!

ఫోటో రైటప్స్..

1) మున్సిపల్ కార్యాలయంలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు
2) ఆర్ అండ్ బి కార్యాలయంలో అపరిశుభ్రత పరిసరాలు
3) మండల పరిషత్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో చెత్త, పిచ్చి మొక్కలు
4) తాహాసిల్దార్ కార్యాలయంలో అపరిశుభ్రంగా ఉన్న పరిసర ప్రాంతాలు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now