Armoor: ఆర్మూర్, ఆగస్టు 31 (ప్రజా శంఖారావం): Armoor/నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో దయానంద్ నగర్ కాలనీలోని మున్నూరు కాపు నడింపంతా ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో (GANESH IN NAVARATRI CELEBRATIONS) భాగంగా ప్రముఖ వేద పండితులు గోపికృష్ణ (GOPIKRISHNA) పంతులుచే ఆదివారం (SUNDAY) కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: పొరపాటున కూడా నరసింహ స్వామి జయంతి రోజున ఈ తప్పులు చేయకూడదు.. లేకపోతే సమస్యలు తప్పవు..
నడిమి పంత అధ్యక్షులు (PRESIDENT) తెడ్డు బాల్ రెడ్డి (BALREDDY)మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో భాగంగా తాము భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం (KUMKUMKARCHANA PROGRAM) నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు, సంఘ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు పెద్ద మొత్తంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద కాపులు పోల లింగం, భాశెట్టి దయాల్, టక్కుర్ దినేష్, కుంట చిన్నారెడ్డి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.