Assembly | నిర్మల్, మార్చ్24, (ప్రజా శంఖారావం): రాష్ట్ర శాసనసభలో జరిగిన సమావేశాల్లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల గ్రామంలో ప్రజలకు, పంటపొలాలకు ఇబ్బందులు తలెత్తుతాయని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం తెలిసిందే.
రైతు ఉద్యమానికి ప్రభుత్వం దిగివచ్చి ఫ్యాక్టరీని రద్దు చేస్తామని ప్రకటించింది. కానీ ఈ ఉద్యమంలో అనేక మంది మహిళలు, రైతులు, గ్రామ ప్రజలపై పోలీసులు కేసులు నమోదు చేశారని తక్షణమే నమోదైన కేసులన్నీ కొట్టివేయాల్సిందిగా అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ లో ప్రస్తావించి స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అమాయక ప్రజలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.