Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో అటాచ్డ్ బాత్రూం ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అంటూ వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. వీటి విషయంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా వాళ్ళు భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఇంట్లో కూడా బాత్రూం తప్పనిసరిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు బాత్రూమ్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది పడకగదిలో ఒక అటాచ్డ్ బాత్రూంను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వాస్తు నియమాలను పాటించి ఇది నిర్మించుకుంటున్నారు. అయితే వాస్తు నియమాలను ఫాలో అయ్యి పడకగదిలో అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించుకున్నప్పటికీ దంపతులు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఆ ఇంట్లో అశాంతి వాతావరణం ఉంటుందని అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు.
కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా అటాచ్డ్ బాత్రూం విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఇంట్లో పడక గదిలో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ ప్రభావం భార్యాభర్తల సంబంధం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్తున్నారు. కాబట్టి ప్రతిరోజు భార్యాభర్తలు నిద్రపోతున్న సమయంలో బాత్రూం వైపు పాదాలు ఉండకుండా చూసుకోవాలి. బాత్రూం వైపు కాళ్లు పెట్టి నిద్రపోతున్నట్లయితే మీ దాంపత్య జీవితంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీరు నిద్రపోతున్న సమయానికి ముందు మీ బాత్ రూమ్ తలుపును తప్పనిసరిగా మూసి పెట్టాలి అంటే వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు.
ఈ విధంగా చేయకపోతే భార్య భర్తల మధ్య గొడవలు తప్పవు. ఇటువంటి పొరపాట్లు మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి నిద్రపోయే ముందు తప్పనిసరిగా బాత్రూం తలుపులను మూసి పెట్టాలి. మీరు బాత్రూం లో పెయింట్ వేస్తున్న సమయంలో లైట్ కలర్ బాత్రూంకు పెయింట్ వేసేలాగా చూసుకోవాలి. గోధుమ లేదా తెలుపు రంగులు బాత్రూమ్స్కు బాగా సరిపోతాయి అని చెప్పొచ్చు. అలాగే నీలిరంగు బకెట్ లేదా డబ్బు వంటివి బాత్రూంలో ఉండేలాగా పెట్టుకోవాలి.