Dogs Attack: మెట్ పల్లి, జూలై11 (ప్రజా శంఖారావం): పొద్దున పొద్దున్నే స్కూలుకు వెళ్దామని వెళుతున్న పిల్లలపై ఊరకుక్కలు స్వైర విహారం చేశాయి. నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులపై ఊరకుక్కలు దాడి చేయడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే మెట్ పల్లి పట్టణంలోని 14 వ వార్డ్ బోయవాడలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి.
Also Read: ఆ చిన్నారికి ఆమె వరుసకు చిన్నమ్మ.. కానీ ఏం చేసిందో తెలుసా..!
పాఠశాలకు వెళుతున్న ఆరుగురు విద్యార్థులను కుక్కలు కరిచాయి. చిన్నారితో కలిసి వెళ్తున్న ఓ మహిళపై కూడా కుక్కలు దాడి చేసి కరిచాయి. కుక్కల దాడిలో 6గురు పిల్లల తోపాటు ఇద్దరు పెద్దవాళ్లపై దాడి చేసి కరిచాయి. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఊర కుక్కల స్వైర విహారం రోజురోజుకు పెరుగుతుందని మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
Also Read: ఊర కుక్కల దాడిలో 9 మందికి గాయాలు