Vastu Tips: కిచెన్ లో పొరపాటున కూడా ఫ్రిడ్జ్ ఈ దిశలో పెట్టకూడదు.. లేదంటే సమస్యలు తప్పవు

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తప్పకుండా ఉండే వస్తువులలో ఫ్రిజ్ కూడా ఒకటి. ఆహారాన్ని తాజాగా ఉంచడానికి అలాగే పండ్లు కూరగాయలు వంటివి కూడా తాజాగా ఉంచడానికి ఫ్రిడ్జ్ బాగా సహాయపడుతుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిడ్జ్ వంటగదిలో ఏ దిశలో ఉండాలో కూడా చెప్పబడింది.

ఒకవేళ పొరపాటున కూడా ఫ్రిడ్జ్ వంటగదిలో తప్పు దిశలో పెట్టినట్లయితే కుటుంబ సభ్యుల జీవితంపై అదీ ప్రతికూల స్వభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి రావడానికి అలాగే ప్రతికూల శక్తి బయటకు పోవడానికి చాలా నియమాలు చెప్పబడ్డాయి. శక్తి సమతుల్యతపై వాస్తు శాస్త్రం ఆధారపడి ఉంటుంది. ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లో వస్తువులు ఏ దిశలో పెట్టుకోవాలో కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ప్రతి ఇంట్లో కూడా అతి ముఖ్యమైన ప్రదేశం ఆ ఇంటి వంటగది.

వంటగది కేవలం ఆహారం తయారు చేసే చోటు మాత్రమే కాదు ఇది ఆ ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కేంద్రం కూడా. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో పెట్టే ప్రతి వస్తువుకు ఒక సరైన దిశ ఉంటుంది. చల్లదనం మరియు నిశ్చలతకు ప్రతిగా అయినా ఫ్రిజ్ను వంటగదిలో వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో పెట్టాలి. వంట గదిలో ఫ్రిడ్జ్ ఆగ్నేయ మూలలో ఉండాలి. ఆగ్నేయ కోణాన్ని అగ్ని కోణం అని కూడా పిలుస్తారు. ఆగ్నేయ దిశలో ఫ్రిడ్జ్ పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే వంటగదిలో వాయువ్య దిశలో కూడా ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిడ్జ్ ఈశాన్య దిశలో పెట్టకూడదు. ఈ దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు. అలాగే నైరుతి దిశలో కూడా ఫ్రిడ్జ్ పెట్టకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now