Social Media: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం చాలా ఎక్కువ అయింది. ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం లేదా పుకార్లను వ్యాప్తి చేయడం జరుగుతుంది. ఇటువంటివి కొన్నిసార్లు చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ తాజాగా ఇటువంటి పుకార్లను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసే వారికోసం ఒక సరి కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే బెంగళూరు పోలీసులు ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో నకిలీ పుకార్లు కానీ తప్పుడు సమాచారం కానీ వైరల్ కాకుండా ఉండేందుకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు.
సోషల్ మీడియాతో పాటు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ లను కూడా ఈ స్మార్ట్ సిస్టం పర్యవేక్షిస్తుంది. నకిలీ కంటెంట్ ను ఇది గుర్తిస్తుంది. వినియోగదారులు దీనిలో ఒక కీవర్డ్ మాత్రమే ఎంటర్ చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంబంధిత సమాచారం నిజమేనా లేదా పుకారా అని ఏఐ సాంకేతిక సహాయంతో తనిఖీ జరుగుతుంది. ఈ క్రమంలో ఏదైనా బ్రాండ్, వ్యక్తి లేదా సంస్థ కు సంబంధించిన పోస్టులు స్కాన్ జరుగుతాయి. ఆ కంటెంట్ లో ఉపయోగించిన భాష తీరు అలాగే అభ్యంతరకరమైన పదాలు, తప్పుడు సమాచారం వంటివి ఏఐ వెంటనే గుర్తిస్తుంది. బెంగళూరు పోలీసు సీనియర్ అధికారులు ఈ వ్యవస్థ కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టారు.
రియల్ టైం లో ఏఐ వ్యవస్థ సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ను పర్యవేక్షిస్తుంది. తప్పుడు సమాచారం ఏదైనా వ్యాప్తి జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే దానిని గుర్తించి తొలగిస్తుంది. మన దేశ సోషల్ మీడియాను మాత్రమే కాకుండా టిక్ టాక్, వినియో, ఫేస్బుక్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఎక్స్ వంటి గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను కూడా విశ్లేషిస్తుంది. అలాగే న్యూస్ వెబ్సైట్స్, పబ్లిక్ ఫోరంలోని కూడా ఏఐ పర్యవేక్షిస్తుంది. దీంతో సామాన్య ప్రజలకు తప్పుడు సమాచారం చేరకుండా ఉంటుంది. ఇవి వ్యవస్థ ద్వారా నకిలీ వార్తలను సులభంగా గుర్తించే అవకాశం ఉంది. దోషణాత్మక భాషను కూడా కనిపెట్టడం చాలా సులభం.