Ration Card: చాలామంది ఎప్పటినుంచో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. ఇటువంటి వారికి తాజాగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత ఉన్నవారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. ప్రభుత్వం అందించిన ఈ శుభవార్తతో చాలామందికి ఊరట లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహా పలు జిల్లాలలో మంజూరు చేసినట్లు తెలిపింది. ఈనెల దాదాపుగా 818 కొత్త రేషన్ కార్డులు మేడ్చల్ జిల్లా పరిధిలో అర్హులకు మంజూరు అయ్యాయి.
కొత్త రేషన్ కార్డులు అందడం వలన చాలామందికి ఊరట లభించింది. అలాగే కొత్త రేషన్ కార్డు అందుకున్న వారికి మరొక శుభవార్త కూడా ఉంది. వీళ్లు కూడా రేషన్ ద్వారా బియ్యం పొందే అవకాశం ఉంది. ఈ నెల 15 వరకు రేషన్ షాపుల్లో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా బియ్యం అందిస్తామని అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డు పొందిన వారికి ఇది మరొక శుభవార్త అని చెప్పొచ్చు. అలాగే మీరు ఇంటి నుంచే ఈపిడిఎస్ తెలంగాణ అధికార వెబ్సైట్లోకి వెళ్లి మీ ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేయడం ద్వారా మీకు రేషన్ ద్వారా బియ్యం వస్తాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు.
కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్లు ఈ విధంగా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హులు కొత్త రేషన్ కార్డుల కోసం తమ కళ్ళు కాయలు కాసేలాగా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కానీ సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది అర్హులు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి రావడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నారు.