Gold: ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర భారీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పెరిగిన బంగారం ధరలను చూసి బంగారం కొనడానికి వణుకు పుడుతుంది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అంటూ చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రతిరోజు బంగారం ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే బంగారం కొనాలని ఎదురు చూస్తున్నా వారికోసం ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. మరి కొన్ని రోజుల్లో బంగారాన్ని కేజీల లెక్కన సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఈ వార్త వింటుంటే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ నిజమే అని చెప్తున్నారు. సీసాన్ని బంగారంగా మార్చడంలో సీఈఆర్ఎన్ లార్జ్ హార్డ్రాన్ కొలైడర్ అని పిలవబడే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ లో భౌతిక శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు సీసా కేంద్రకాల అధిక శక్తి ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాల ఏర్పాటును వీరు గమనించారు. ఆధునిక భౌతిక శాస్త్రం ద్వారా శాస్త్రవేత్తలు యుగాలనాటి రసవాద ఆకాంక్షను ఇందులో గ్రహించారు.
శాస్త్రవేత్తలు ఏ ఎల్ ఐ సి ఈ ప్రాజెక్టులో నిర్వహించిన పరిశోధనలు బిగ్ బ్యాంగ్ తర్వాత కొంతకాలం ఉన్న ప్రాథమిక శక్తులు మరియు పరిస్థితులపై విలువైన ఇన్సైడ్స్ ను అందిస్తాయని చెప్తున్నారు.ఇటీవలే ఫిజికల్ రివ్యూ జనరల్స ఇచ్చిన ఒక నివేదికలో ఏ ఎల్ ఐ సి ఈ సహకారంతో సీఈఆర్ఎన్ లార్జ్ అడ్డం కోలైడర్ లో సీసం బంగారంగా మారడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మరింత బంగారాన్ని ఈ పద్ధతిలోనే ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వదిలినట్లయితే సప్లై బాగా పెరిగి డిమాండ్ తగ్గి బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు.