Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా..! అది దేనికి సంకేతమో తెలుసా..!

Money Plant
Money Plant

Money Plant: కొంతమంది తమ ఇంట్లో రకరకాల మొక్కలను పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. మనీ ప్లాంట్ మొక్కకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. మనీ ప్లాంట్ మొక్క ఇంటికి అందాన్ని పెంచడం కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెట్టడం వలన ఆ ఇంట్లో శ్రేయస్సు కలుగుతుందని దీని వలన ఆర్థిక పరమైన సమస్యలు కూడా తగ్గుతాయి అని చాలామంది నమ్ముతారు. ఈ క్రమంలోనే చాలామంది తమ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క నాటుకుంటారు.

అయితే కొన్ని కొన్ని సార్లు మనీ ప్లాంట్ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారడం మీరు చూసే ఉంటారు. అయితే మనీ ప్లాంట్ మొక్క ఆకులు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతర మొక్కల లాగానే మనీ ప్లాంట్ మొక్క ఆకులు పచ్చ రంగులోకి ఉండడానికి గల కారణం ఆ మొక్కలో ఉన్న క్లోరోఫిల్. క్లోరోఫిల్ మొక్కను ఆకుపచ్చ రంగు ఇచ్చే ఒక వర్ణ ద్రవ్యం. మనీ ప్లాంట్ మొక్కను ఒకవేళ ఇంట్లో తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో పెట్టడం వలన ఆ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయని చెప్తున్నారు.

వెలుతురు తక్కువ అన్న ప్రదేశంలో మనీ ప్లాంట్ మొక్కను ఉంచినట్లయితే అది క్లోరోఫిల్ సరిగా ఉత్పత్తి చేయలేక దాని ఆకులు పచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారుతాయి. అయితే మనీ ప్లాంట్ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారకుండా ఉండాలి అంటే దీనిని వెలుతురు ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటాలి లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now