Acharya Chanikya: ఆచార్య చాణిక్యుడి గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రాన్ని చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఆచార చానిక్యుడు మనిషి జీవితంలో ఉన్న అనేక విషయాల గురించి నియమాల గురించి నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆచార్య చానిక్యుడు గొప్ప పండితుడు. మనిషి జీవితం యొక్క అన్ని విషయాలపై కూడా బాగా అవగాహన ఉన్న వ్యక్తి. నీతి శాస్త్రంలో ఈయన బోధించిన చాలా విషయాలు మానవాళికి చాలా ఉపయోగపడతాయి. ఆచార చాణిక్యుడు నీతి శాస్త్రంలో ఇటువంటి నలుగురు వ్యక్తులతో సావాసం చేస్తే మరణాన్ని ఆహ్వానించినట్లే అని చెప్పుకొచ్చారు.
అయితే ఈ నలుగురు వ్యక్తులు ఎటువంటి వారు. వారికి ఎందుకు దూరంగా ఉండాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఎల్లప్పుడూ గొడవ పడుతూ మరియు అబద్ధాలు చెబుతూ కుటుంబ సభ్యులలో విభేదాలు సృష్టించే భార్యకు దూరంగా ఉండాలి. అలాగే ఆపదలో మీకు సహాయం చేయకుండా తన స్వలాభం చూసుకునే స్నేహితుడికి కూడా దూరంగా ఉండాలి. మీకు కష్టం ఉన్న సమయంలో మిమ్మల్ని వదిలేసే స్నేహితుడికి దూరంగా ఉండాలి అని ఆచార్య చానిక్యుడు తెలిపాడు.
అలాగే నిజాయితీ లేని వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. మీ ఇంట్లో లేదా వ్యాపారంలో మీ ముందు నటిస్తూ మీ వెనకాల మీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులకు దూరంగా ఉండాలి అంటూ ఆచార్య చాణిక్యుడు తెలిపారు. మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఆ తర్వాత మిమ్మల్ని బాధ పెట్టడం లేదా మీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించే వ్యక్తికి చాలా దూరంగా ఉండాలని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. ఈ లక్షణాలు ఉన్న నలుగురు వ్యక్తులతో స్నేహం చేస్తే మరణాన్ని ఆహ్వానించినట్లే అంటూ ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు.