Todays Gold Rate: ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తులం పసిడి ధర లక్ష రూపాయలను క్రాస్ చేసింది. అయితే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలలో కొంచెం తగ్గుదల కనిపించడంతో పసిడి ప్రియులకు కొంత ఊరట లభించింది. అంతర్జాతీయంగా జరుగుతున్న ఈక్విటీ మార్కెట్ల పై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటివి కూడా బంగారం పెరగడానికి ఒక కారణం అవుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలో ఉన్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి కి ఎల్లప్పుడూ డిమాండ్ ఒకే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు వీటి ధరలు తగ్గుతుంటే మరి కొన్నిసార్లు మాత్రం భారీగా పెరుగుతూ ఉంటాయి. జూన్ 25, 2025 బుధవారం రోజున దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లో స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.99,210, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.90,940. ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,900 గా ఉంది.
మన దేశంలో ఉన్న ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరులో స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.99,210, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.90,940 గా ఉంది. ఇక ఢిల్లీ నగరంలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,360, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.91,090 గా ఉంది. ఈ నగరాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,900 గా ఉంది.