Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలో అందరికీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం దిగి వస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం లక్షకు చేరుకున్న బంగారం ధర ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. బంగారం కొనాలని చూస్తున్న వాళ్లకి ఇది మంచి వార్త అని చెప్పొచ్చు. నేడు మే 1 గురువారం రోజున మన దేశం మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నాయి. దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో కూడా బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించింది.
ఏప్రిల్ 30 అక్షయ తృతీయ సందర్భంగా మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ.95,800 కి చేరుకుంది. ఈరోజు కూడా బంగారం కొనాలని చూస్తున్న వాళ్లకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మే ఒకటి, గురువారం రోజున బంగారం ధరలు మరింత తగ్గినట్లు తెలుస్తోంది. మన దేశ మార్కెట్లో గురువారం ఉదయం 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,740, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.97,900 గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.89,740, అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ.97,900 గా ఉన్నాయి.
ఇక ఇతర ప్రాంతాలైన విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్ మరియు వరంగల్ వంటి పలు ప్రధాన ప్రాంతాలలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో ఈరోజు ఉదయం 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ.89,740, 24 క్యారెట్ల గోల్డ్ ధర పది గ్రాములు రూ.97,900. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు రూ.89,740, 24 క్యారెట్లు గోల్డ్ ధర రూ.97,900 గా ఉన్నాయి.
ఢిల్లీ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,890 అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,030 గా ఉన్నాయి. ఇక బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,840, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.97,900 గా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఈరోజు కిలో వెండి ధర రూ.99,900 గా ఉంది. అలాగే పలు ప్రధాన ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, కోల్కత్తాలో కూడా వెండి ధరలు ఈ విధంగానే ఉన్నాయి. ఇక చెన్నై మరియు హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర ఈరోజు రూ.1,08,900 గా ఉన్నట్లు సమాచారం.